ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం జమ్మలపాలెం నుంచి ఎన్డీయే కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆదివారం నాడు పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జమ్మలపాలెంలో కాకర్ల ఇంటింటి ప్రచారం చేశారు. ఆ తర్వాత లింగరాజు అగ్రహారంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ- ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్, కాకర్ల ప్రవీణ దంపతులకు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇక, కాకర్ల సురేష్ దంపతులు పల్లె జనానికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని వేడుకున్నారు.
Read Also: YS Bharathi: చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి కౌంటర్.. వయసులో పెద్దవారు.. అలా మాట్లాడటం తప్పు..
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల రణరంగంలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ అనే నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మార్పు లేదన్నారు. ఉదయగిరి నియోజకవర్గం దశ దిశ మార్చేందుకు వచ్చానన్నారు. దోచుకుని దాచుకునేందుకు రాలేదు.. కష్టపడి సంపాదించిన సొమ్మును పుణ్యభూమికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో వచ్చానన్నారు. ఎన్నికల సంగ్రామంలో యుద్ధ వీరుడుగా మీ ముందుకు వచ్చానని వీర సైనికులుగా తిలకం దిద్ది ముందుకు నడిపించాలని ఆయన కోరారు.
Read Also: Uttarakhand : ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు.. ప్రమాదంలో స్కూల్స్, కాలేజీలు
ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తానని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల డెవలప్మెంట్ చెందుతుందన్నారు. 24000 కిలో మీటర్లు రోడ్లు వేసిన ఘనత చంద్రబాబుది.. అంగన్వాడీల ద్వారా ఒక్క లక్ష 80000 మందికి పౌష్టికాహారం అందజేశామని గుర్తు చేశారు. ఈ ఎన్నికల రణరంగంలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అనే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
Read Also: Fire accident: యూపీలోని జలౌన్ సెషన్స్ కోర్టులో భారీ అగ్నిప్రమాదం
అలాగే, ఉదయగిరి మండలంలోని దాసరపల్లి గ్రామంలో కాకర్ల సునీల్, కాకర్ల సురేఖ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. టీడీపీకి ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని కాకర్ల సునీల్ దంపతులు అన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. మే 13న జరగ పోలింగ్ రోజు ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ ని, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు.