Kolikapudi Srinivasa Rao: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకి గ్రామంలో మహిళలు హారతులతో, పూలమాలలతో, యువత బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రెండు నెలల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
Read Also: Pawan Kalyan: పేకాటలో క్లబ్బులు నడిపే వాళ్ళు కావాలా.. డీఎస్సీ ఇచ్చే వాళ్ళు కావాలా..
రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ (చిన్ని)కి, శాసన సభ్యుడిగా కొలికిపూడి శ్రీనివాసరావుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ విసన్నపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నారై వల్లభనేని గిరి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళుతూ ఆప్యాయంగా పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తిరువూరు అసెంబ్లీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావును, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని గెలిపించాలని కోరుతున్నారు.