ప్రజలకు మంచి చేయాలనే సేవాగుణంతో సొంత నిధులతో అందరికీ సాయం చేసే వ్యక్తి అన్నా రాంబాబు. ఎవ్వరికీ ఏ కష్టం వచ్చిన ప్రజాభివృద్ధికి పాటు పడే మనిషిగా మంచి పేరు తెచ్చుకున్న మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుని గెలిలించండి.. నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయండని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. మంగళవారం నాడు రాత్రి పొదిలి టౌన్ లోని 5, 6వ వార్డులోని దాసరి గడ్డ, తహసీల్దార్ కార్యాలయం ఏరియా, ఓబుళశెట్టి వారి వీధిలోని పలు ప్రాంతాల్లో ప్రతి ఇంటింటికి తిరిగి మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుకు మద్దతుగా ఆయన సతీమణి దుర్గా కుమారి, కుమార్తె సౌజన్య, కోడలు అన్నా అనూషలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Read Also: Madhyapradesh : అన్నంలో మత్తుమందు పెట్టి.. రెండో తరగతి చిన్నారి పై హాస్టల్లో అత్యాచారం
ఈ సందర్భంగా మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబుని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నా రాంబాబు సతీమణి దుర్గా కుమారి అభ్యర్థించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా మన నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడదామని తెలిపారు. ప్రజలకు మేలు చేసేందుకు జగనన్న చేస్తున్న కృషిని ప్రజలేవరూ మరువలేనిదన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో తిరిగి జగనన్నను సీఎంగా ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక, ముందుగా ఎమ్మెల్యే అన్నా కుటుంబ సభ్యులను పొదిలి టౌన్ లోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల, టౌన్ పరిధిలోని వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.