ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని భుజబలపట్నం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సతీమణి దూలం వీర కుమారి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పేదలకు మంచి చేసిన వైఎస్ జగనన్నే మళ్ళీ రావాలి.. కైకలూరును అభివృద్ధి చేసిన నాగేశ్వరరావు మళ్ళీ గెలవాలి అని పేర్కొన్నారు. మీ అమూల్యమైన రెండు ఓట్లను ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ లను వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దూలం వీర కుమారి అభ్యర్థించారు.
Read Also: Benjamin Netanyahu : దాడులు ఆపండి.. లేదు చేసి తీరుతానంటున్న నెతన్యాహు
అలాగే, కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు దూలం అనుపమ కలిదిండి మండలం పోతుమర్రు పంచాయతీ పరిధిలోని వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ని, కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావుని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక, దూలం నాగేశ్వరరావు చిన్న కోడలు దూలం స్వాతి సైతం ముదినేపల్లి సెంటర్, అంబేద్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావుని భారీ మెజారిటీతో గెలిపించాలని దూలం స్వాతి అభ్యర్థించారు.