CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఇవాళ నిర్మల్, గద్వాల, తుక్కుగూడ, శంషాబాద్ లో పర్యటించనున్నారు. ఇక, నిర్మల్, గద్వాల జన జాతర సభలకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. నేటి ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి నిర్మల్ జన జాతర సభలో సీఎం పాల్గొననున్నారు. అలాగే, సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి గద్వాలలోని అలంపూర్ జన జాతర సభలో పాల్గొంటారు. ఇక, సాయంత్రం 7 గంటలకు తుక్కుగూడ కార్నర్ మీటింగ్ కు రేవంత్ హాజరుకానున్నారు. రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ లో నిర్వహించే కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.
Read Also: Bharateeyudu 2 : శంకర్ సార్.. ఇంకెన్ని షాక్ లు ఇస్తారు..?
కాగా, ఎన్డీయే ప్రభుత్వ హయాంలోని వైఫల్యాలను ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అలాగే, కాంగ్రెస్ పాంచ్ న్యాయ్, పచ్చిస్ గ్యారెంటీలను సైతం ప్రజలకు తెలియజేయనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఇక, తెలంగాణలో 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పట్టుదలతో ముందుకు సాగుతుంది. పార్టీ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బాధ్యతలను మోస్తున్నారు.