విశాఖలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓల్డ్ గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనేనని తెలిపారు. విశాఖను రాజధానిగా చేయడమే కాదు.. జూన్ 4న ప్రమాణ స్వీకారం, పాలన చేసేది ఇక్కడ నుంచేనని పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో స్ధానిక నాయకులతో కలిసి గన్నవరం నియోజకవర్గం జనసేన, బీజేపీ బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆయనకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ..…
కృష్ణా జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తోట నరసింహంకు మద్దతుగా ఆయన తనయుడు రాంజీ ప్రచారం నిర్వహించారు. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తన తండ్రిని ఆశీర్వదించాలని కోరారు. గతంలో తోట నరసింహం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గంపేట అభివృద్ధిలో ముందు ఉందని గుర్తు చేశారు. జగన్ మళ్ళీ సీఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతాయని…
మోడీ గుండెలో బండి సంజయ్ కి ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ అభ్యర్థి అన్నమలై అన్నారు. సౌతిండియాలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ పదవిచ్చారని తెలిపారు. యూత్ ఐకాన్... సంజయ్ అని కొనియాడారు. బండి సంజయ్ స్పూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేసినట్లు అన్నామలై తెలిపారు. ఈ ఎన్నికల్లో 60 శాతం ఓట్లతో సంజయ్ ను గెలిపించండని.. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని అన్నామలై పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని.. అక్కడ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మహబుబాబాద్ జిల్లా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పై ప్రజల ఆశీస్సులుండాలని తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చిన పార్టీ బీజేపీ అని అన్నారు. సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసు.. ఆదివాసీ, గిరిజన…
తెలుగుదేశం గెలుపు ప్రగతికి మలుపుని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఉదయగిరి యూత్ ఆధ్వర్యంలో టీడీపీకి మద్దతుగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ర్యాలీలో కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఉదయగిరి ప్రాంతాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు. మరోవైపు.. తెలుగుదేశం యువత ర్యాలీకి బ్రహ్మ రథం పట్టారు. ఉదయగిరి బస్టాండ్ నుండి తెలుగు దేశం అనుబంధ సంఘాల…