Kesineni Swetha: తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత, యాంకర్ శ్యామల పాల్గొన్నారు. స్వచ్చందంగా వైస్సార్‌సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో యాంకర్ శ్యామల ఈ రోజు 51వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కేశినేత శ్వేత తెలిపారు. ప్రతి ఒక్కొక్క గడపకు వెళ్తుంటే.. జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తాం.. జగన్ బిడ్డను గెలిపించుకుంటాం.. జగన్ అన్నను గెలిపించుకుంటాం.. జగన్ మామను గెలిపించుకుంటాం.. అని చెప్తున్నారన్నారు. ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారు.. చాలా సంతోషంగా ఉన్నారు.. జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కేశినేని శ్వేత పేర్కొన్నారు.
నవరత్నాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె అన్నారు. ప్రతి పేద వాడి ఇంట్లో అమ్మ ఒడి, చేయూత, పెన్షన్ వంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి అందించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కొవిడ్ ఉన్నా కానీ 7 శాతం పావర్టీ రేటును జగన్ తగ్గించారన్నారు. పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం జగన్ సర్కారు అని ఆమె వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు కోసం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 45 వేల పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరు ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారని, ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారన్నారు.
కేశినేని నాని విజయవాడ ప్రజలకు ఒక పెద్ద కొడుకు లాంటి వాడన్నారు. విజయవాడ ప్రాంతం కోసం పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని ఎంతో కృషి చేశారని కేశినేని శ్వేత తెలిపారు. కేశినేని భవన్ ద్వారా ఎప్పుడు పేద ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కేశినేని నాని అంటూ చెప్పుకొచ్చారు. విజయవాడలో అసాధ్యం అయినా పనులను కూడా చేసి చూపించిన వ్యక్తి కేశినేని నాని అంటూ పేర్కొన్నారు. విజయవాడ రూపురేఖలు మార్చిన వ్యక్తి కేశినేని నాని అంటూ చెప్పారు. 8000 కోట్లతో విజయవాడ అభివృద్ధి కోసం కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ఎయిర్ పోర్ట్, హాస్పిటల్, రింగ్ రోడ్డు, ఇవ్వి అన్ని కేశినేని నాని విజయవాడ కోసం చేసిన అభివృద్ధి అని తెలిపారు. ఏ నగరంలో చేయని అభివృద్ధి విజయవాడ నగరంలో కేశినేని నాని చేసి చూపించారన్నారు. విజయవాడను జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ అండ్ బిజినెస్‌గా మార్చబోతున్నారని కేశినేని శ్వేత స్పష్టం చేశారు.