Telangana Bandh: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.. ఎంజీబీఎస్ నుంచి రోజూ 3500 బస్సుల రాకపోకలు సాగించేవి.. బంద్ నేపథ్యంలో ఒక్క బస్సు కూడా…
తెలంగాణ రాష్ట్రంలో బోనాలు సంబరాలు అంబరాన్నంటాయి. నిన్న లాల్ దర్వాజ బోనాల సందర్భంగా బంగారు బోనాలతో.. పట్టు వస్త్రాలతో మంత్రులు, క్రీడాకారులు, నేతలు, హాజరై అమ్మవారికి సమర్పించారు. అయితే బోనాల సందర్భంగా.. ఓ అరుదైన సన్నివేశం చర్చకు దారితీస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం ఆయన బీజేపీ పార్టీలో చేరి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై…
సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ అహంకారం తొలగిపోయేరోజు దగ్గరలోనే ఉందన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. కానీ కేసీఆర్ తనను పదే పదే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేశారని.. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని ఈటల అన్నారు. కేసీఆర్ తరహాలో తాను సంస్కారం లేకుండా మాట్లాడనని…
తమ భూముల వ్యవహారంలో మెదక్ కలెక్టర్ హరీష్ చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల భార్య జమున స్పందించారు. జమున హేచరీస్‌కు సంబంధించిన భూములను ఈటల బలవంతంగా ఆక్రమించుకున్నారని కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. భూముల అంశం కోర్టు పరిధిలో ఉందని… తమకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ ఎలా పెడుతారని జమున ప్రశ్నించారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టడానికే ఉన్నారా? కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్లర్క్‌గా…
నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి అని… ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి తెలంగాణ లో లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినంద సభ లో ఈటల రాజేందర్ ను సన్మానించారు నేతలు,…
ఇవాళ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈటల రాజేందర్. స్పీకర్ కార్యాలయంలో ఈటల రాజేందర్ ప్రమాణం చేయనున్నారు. కాగా… భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి మే మాసంలో బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అంతేకాదు… ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం బీజేపీ లో…
న్నికల్లో భారీ పోలింగ్ జరగడం అభ్యర్ధుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. 2018 ఎన్నికల సందర్భంగా హుజురాబాద్‌లో 2,26,000 పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నికలో కొత్తగా నమోదు చేసుకున్నవారికి ఓటు హక్కు కల్పించారు. దీంతో పది వేల ఓట్లు పెరిగి… ఆ సంఖ్య ఇప్పుడు 2,36,873కు చేరింది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలున్నాయి. ఇల్లంతకుంట మండలంలో మిగతా మండలాల కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మండలంలో కేవలం 24,799 మంది ఉండగా.. హుజురాబాద్ మండలంలో…
తెలంగాణ మంత్రులు చేసిన వాఖ్యలపై ఈటల ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారు.. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించ లేదని మండిపడ్డారు. వ్యక్తులు ఉంటారు, పోతారు కానీ.. ధర్మము ఎక్కడికి పోదు ప్రభుత్వం దుర్మార్గముగా వ్యవహరిస్తోందన్నారు. సీఎం కెసిఆర్ చట్టాన్ని, ధర్మాన్ని, చివరికి ఉద్యమాన్ని కూడా అమ్ముకున్నాడని..పార్టీకి వ్యతిరేక పనులు నేనెప్పుడూ చేయలేదన్నారు ఈటల. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు..నాపై విమర్శలు సరికాదని పేర్కొన్నారు.…
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పిడిగుపాటు వార్త చెప్పిందని.. రెమిడిసివేర్ ఇంజక్షన్లు కేంద్రం పరిధిలోకి తీసుకుందని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఇది చాలా బాధాకరంగా ఉందని..కేంద్రం నిర్ణయానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన రెమిడిసివేర్ మాకు అవసరం ఉన్నంత ఇవ్వాలని…దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు ఈటల. రెమిడిసివేర్ కొరత రాకుండా.. 4 లక్షల వైల్స్ కి ఆర్దర్…