కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పిడిగుపాటు వార్త చెప్పిందని.. రెమిడిసివేర్ ఇంజక్షన్లు కేంద్రం పరిధిలోకి తీసుకుందని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఇది చాలా బాధాకరంగా ఉందని..కేంద్రం నిర్ణయానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన రెమిడిసివేర్ మాకు అవసరం ఉన్నంత ఇవ్వాలని…దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు ఈటల. రెమిడిసివేర్ కొరత రాకుండా.. 4 లక్షల వైల్స్ కి ఆర్దర్ పెట్టామని.. హైదరాబాద్ కు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక పేషేంట్లు వస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల వారికి వైద్యం చేస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం తీరుపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని.. కేంద్రం కొంటె ఒక ధర… రాష్ట్రం కొంటె ఒక ధర పెట్టడం ఏంటి ? అని నిప్పులు చెరిగారు. ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పటి వరకు కేంద్రమే వ్యాక్సిన్ పంపిణీ చేసిందని.. భవిష్యత్ లో కూడా పంపిణీ చేస్తుందని అనుకుంటున్నామని పేర్కొన్నారు.