వంట నూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంట నూనెల ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. దేశీయంగా వంట నూనెల గరిష్ట రిటైల్ ధర( ఎంఆర్పీ)ని లీటర్ కు రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఆదేశించింది. శుక్రవారం రోజున తయారీదారులు, రిఫైనలరీలకు, పంపిణీదారులు తగ్గించిన ధరను వెంటనే అమలు చేయాలని…
దేశంలో వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. లీటరుకు గరిష్టంగా రూ.15 వరకు తగ్గింపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో మరో వారంలో హోల్‌సేల్ మార్కెట్లలో నూనె ధరల తగ్గింపు అమలు కానుంది. పామాయిల్‌పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ.10 నుంచి 15 వరకు, సోయాబీన్‌పై రూ.5 తగ్గే అవకాశం ఉంది. మే నెలలో వంట నూనెల కేటగిరిలో రికార్డు స్థాయిలో 13.26 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. దీంతో…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఇండోనేషియా వంటి దేశాలు పామాయిల్ దిగుమతులపై నిషేధం విధించడం కూడా వంటనూనెల ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. దీంతో మూడు నెలలుగా దాదాపు కిలో వంట నూనె ధర రూ.70 నుంచి రూ.100 పెరిగింది. అయితే త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంట నూనెల విషయంలో ఇండియా సుమారు 60 శాతం…
దేశవ్యాప్తంగా సామాన్యులపై వంట నూనెల ధరల భారం అధికంగా పడుతోంది. తెలుగు రాష్ట్రాలలో అయితే గత వారం రోజుల్లో లీటర్ వంటనూనె ధర రూ.10 మేరకు పెరిగింది. మంగళవారం ఒక్క రోజే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.4 పెరిగింది. ఒకప్పుడు రూ.100 లోపు ఉండే వంట నూనె ధర ఇప్పుడు రూ.200కు పైగా పలుకుతోంది. కుకింగ్ ఆయిల్స్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అదనుగా తీసుకుని వ్యాపారులు కృత్రిమ…
విమానయాన రంగంలో సంచలనం చోటు చేసుకుంది. వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది. అంతేకాకుండా విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు విమానాలలో ఇంధనంగా వైట్ పెట్రోల్‌నే వాడుతుండగా తాజాగా వంటనూనె వాడటం ఓ మలుపుగానే భావించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ-380 పెట్రోల్ కాకుండా పూర్తిగా వంటనూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. ఎయిర్‌బస్ విమానం గత వారం ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్…
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం భారత్‌లోని సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ కారణంగా ఇప్పటికే భారత్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉన్న స్టాక్‌ను వ్యాపారులు బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో వంటనూనెలకు కొరత ఏర్పడుతోంది. ఒకవేళ వంటనూనెల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని డీమార్ట్ వంటి పెద్ద షాపింగ్ మాళ్లలో లిమిటెడ్‌గా వంటనూనెల ప్యాకెట్లను…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరా భారీగా పడిపోయింది. సుమారు 80 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 3,07,684 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు పడిపోయాయి. జనవరిలో పోలిస్తే ఫిబ్రవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 22 శాతం పడిపోయాయి. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీగా గిరాకీ ఏర్పడింది.…
రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్‌కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్‌లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట…
పండుగల వేళ కూరగాయలు, ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతుంటే, వంటనూనె ధరలు మాత్రం తగ్గుముఖం పట్టేఅవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వంటనూనె ధరలను నియంత్రించేందుకు కేంద్రం సుంకాలను తగ్గించింది. పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్టు కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు ఉత్తర్వులను జారీ చేసింది. వ్యవసాయ సెస్ లో కోత విధించడంతో మూడి నూనె ధరలు దిగి వస్తున్నాయి. లీటర్‌కు రూ.12 నుంచి రూ.15 వరకు తగ్గే…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇప్పుడు అంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. అయితే, ఇంకా కొందరిలో అపోహలు ఉన్నాయి.. వారి అపోహలు వీడి వ్యాక్సిన్ కోసం అడుగులు వేసేలే.. పలు సంస్థలు రకరకాల స్కీమ్‌లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్‌లోని అమ్‌వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కొత్తగా ఓ ఆఫర్ తీసుకొచ్చింది… వ్యాక్సినేషన్‌కు, పండుగకు లింక్ చేసి.. మరీ ఆఫర్ ప్రకటించింది ఏఎంసీ.. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే లీటర్ వంట నూనె ప్యాకెట్ ఉచితంగా…