Edible Oil: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనెల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఇండోనేషియా వంటి దేశాలు పామాయిల్ దిగుమతులపై నిషేధం విధించడం కూడా వంటనూనెల ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. దీంతో మూడు నెలలుగా దాదాపు కిలో వంట నూనె ధర రూ.70 నుంచి రూ.100 పెరిగింది. అయితే త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
వంట నూనెల విషయంలో ఇండియా సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో పామాయిల్ దిగుమతులపై 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకం తగ్గించినా సామాన్యులకు ప్రయోజనం చేకూరలేదు. ఎందుకంటే అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం, పామాయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
Also Read
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ఈ క్రమంలో అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ తగ్గించడం ద్వారా వంట నూనెల ధరలను కాస్త నియంత్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సెస్‌ను వ్యవసాయ సంబంధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్ధిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ సెస్ తగ్గింపుపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు పలు ప్రాంతాల్లో వంట నూనెల ప్యాకెట్లకు సంబంధించి పాత స్టా్క్ ఉన్నా వ్యాపారులు పెద్ద ఎత్తున సరుకు మొత్తాన్ని గోడౌన్‌లలో దాచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Viral News: ఊరంతా పోస్టర్లు.. చిలుకను పట్టిస్తే రూ.5,100 బహుమతి
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!