దేశవ్యాప్తంగా సామాన్యులపై వంట నూనెల ధరల భారం అధికంగా పడుతోంది. తెలుగు రాష్ట్రాలలో అయితే గత వారం రోజుల్లో లీటర్ వంటనూనె ధర రూ.10 మేరకు పెరిగింది. మంగళవారం ఒక్క రోజే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.4 పెరిగింది. ఒకప్పుడు రూ.100 లోపు ఉండే వంట నూనె ధర ఇప్పుడు రూ.200కు పైగా పలుకుతోంది. కుకింగ్ ఆయిల్స్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అదనుగా తీసుకుని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉండటంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా మధ్య వార్ ఎఫెక్టుతో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పప్పు నూనె కేజీ రూ.380, కేజీ సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.223, కిలో శనగ నూనె రూ.199, పామాయిల్ కేజీ రూ.178, రైస్ బ్రెయిన్ ఆయిల్ కేజీ రూ. 195గా పలుకుతున్నాయి. కాగా ఏపీలో వంటనూనెల ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని మంగళవారం నాడు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. అన్నిరకాల వంటనూనెలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని.. ఒకవేళ అధిక ధరకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా బైండోవర్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
PM Modi: పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు.. అందుకే ధరలు తగ్గడం లేదు