వంట నూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంట నూనెల ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. దేశీయంగా వంట నూనెల గరిష్ట రిటైల్ ధర( ఎంఆర్పీ)ని లీటర్ కు రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఆదేశించింది. శుక్రవారం రోజున తయారీదారులు, రిఫైనలరీలకు, పంపిణీదారులు తగ్గించిన ధరను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Read Also: Samantha: చరణ్-తారక్ రిజెక్ట్.. సమంత కోసం వెయిటింగ్..!
తగ్గిన వంట నూనెల ధరలు వినియోగదారుడిపై భారాన్ని తగ్గించనున్నాయి. అంతర్జాతీయంగా దిగుమతి చేసుకుంటున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గముఖం పట్టాయని.. దీంతో దేశీయ మార్కెట్లలో ధరలను తగ్గించుతున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. మే, 2022లో చివరి సారిగా వంటనూనెల ధరలను తగ్గించారు. ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ పై సుంకాలను తగ్గించిన నేపథ్యంలో వాటి పూర్తి ప్రయోజనం వినియోగదారులకు అందించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు అనూహ్యంగా పతనం అవుతున్నాయి. అయితే ధరలు తగ్గుతున్నా దేశీయ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో వంట నూనెల టన్ను ధర 300-450 డాలర్లకు తగ్గింది. దీంతో రానున్న రోజుల్లో రిటైల్ ధరలెు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.