బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..
తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన టాలీవుడ్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలే ఇది విచారణ ఎదుర్కున్న సెలబ్రిటీలకు మళ్లీ గుండెల్లో గుబులు మొదలైంది. తాజాగా ఈడీ మరోసారి డ్రగ్ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఇటీవల ఈ కేసు పూర్తీ వివరాలను, రిపోర్టులను ఈడీ కి ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఎక్సైజ్ శాఖకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఆ రిపోర్టులను తమకు స్వాధీనం…
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు టాలీవుడ్ సినీప్రముఖుల్ని ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పూరీ, ఛార్మి, రకుల్‌ప్రీత్, రవితేజ, రానా, నవదీప్ వంటి స్టార్స్ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇక సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 22న తరుణ్ విచారణలతో దర్యాపు ముగియనున్నది. అయితే ఈ దర్యాప్తు తరువాత ఈడీ అధికారులు ఏం చేయబోతారనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రేపు నటి ముమైత్…