బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు.. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరు డబ్బు సంపాదించాలని భావించవద్దని సూచించారు.. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలు నమోదు చేసుకున్నారన్నారు.. మళ్ళీ విచారణకు ఈడీ అధికారులు పిలవలేదని వెల్లడించారు..
READ MORE: Amzath Basha: వైఎస్ జగన్ అంటే మీకు అంత భయం.. మాజీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా.. దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు ప్రకాష్‌రాజ్. సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే, ఐదు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. తన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఈడీకి అందజేశారు ప్రకాష్‌రాజ్. జంగిల్ రమ్మీ ద్వారా భారీగా ప్రకాష్‌రాజ్ లాభపడినట్లు చెబుతున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై క్లారిటీ ఇచ్చారు ప్రకాష్ రాజ్. జంగిల్ రమ్మీతో కాంట్రాక్ట్ పూర్తి అయ్యాక.. మళ్లీ రెన్యూవల్ చేయలేదని.. మళ్లీ ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పుకొచ్చారు.