టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు టాలీవుడ్ సినీప్రముఖుల్ని ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పూరీ, ఛార్మి, రకుల్‌ప్రీత్, రవితేజ, రానా, నవదీప్ వంటి స్టార్స్ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇక సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 22న తరుణ్ విచారణలతో దర్యాపు ముగియనున్నది. అయితే ఈ దర్యాప్తు తరువాత ఈడీ అధికారులు ఏం చేయబోతారనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రేపు నటి ముమైత్ ఖాన్ ఈడీ విచారణకు హాజరుకానుంది. గతంలోనూ ముమైత్ ఖాన్ దర్యాప్తుకు సహకరించిన విషయం తెలిసిందే.. ముమైత్ బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు డ్రగ్ పెల్లర్ కెల్విన్‌తో పరిచయాలు, మనీలాండరింగ్ తదితర అంశాలపై ఈడీ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.