MLC Elections In TG: తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Delhi Elections 2025: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు (జనవరి 7) ప్రకటించనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో ఎలక్షన్ కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించి.. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడిస్తుంది.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుత చర్యల కారణంగా ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఇటీవల చేసిన సవరణలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి విజయం సాధించారు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపి మూర్తి.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందినట్టుగా చెబుతున్నారు..
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 93 శాతం పోలింగ్ నమోదయింది. టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మరణంతో బైఎలక్షన్ జరిగిన విషయం విదితమే కాగా.. బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మధ్య జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు టీచర్లు బారులు తీరారు. యూనియన్ల వారీగా విడిపోయి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు మద్దతు ఇచ్చారు.
ఓటింగ్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ని హ్యాక్ చేశాడని ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్ షుజా అనే వ్యక్తి ఈవీఎంల ఫ్రీక్వెన్సీని ట్యాంపరింగ్ చేయడం ద్వారా హ్యాక్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయ్. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడలేదు.
Congress: వరసగా ఓటములు కాంగ్రెస్ పార్టీలో నిరాశను పెంచుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకున్న తర్వాత జోష్ మీద ఉన్న హస్తం పార్టీకి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్కి గురిచేశాయి. మహారాష్ట్రలో అయితే, అత్యంత దారుణమైన రీతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
జార్ఖండ్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్లకు తరలివచ్చారు.