బీహార్ ఎన్నికల తరుణంలో ఓట్లచోరీ ఆరోపణలే హైలైట్ అవుతున్నాయి. ఈ అంశాన్నే ఫోకస్ చేస్తూ.. రాహుల్ ఇప్పటికే ఓటర్ అధికార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ విమర్శలు, ఈసీ కౌంటర్లు, సుప్రీం డైరక్షన్ తర్వాత.. బీహార్ ఎన్నికలు ఎవరి వాదనను నమ్ముతున్నారనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్షాల తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల వేదికగా విపక్షాలు నిరసనలు కొనసాగించాయి.
పులివెందుల, ఒంటిమిట్టలో పోలీసుల వైఖరిపై భగ్గుమంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు వైసీపీ నేతలు.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఘటనలకు నిరసనగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.. పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నినాదాలు.. ఎన్నికల కమిషన్ దగ్గర జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్,…
ఎన్నికల సంఘంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారు. ఇటీవల ఇండియా కూటమికి విందు ఇచ్చిన సందర్భంగా ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఎలక్షన్ కమిషన్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారు. అధికార పార్టీ-ఎన్నికల కమిషన్ ఓట్ల కుట్రకు పాల్పడుతున్నారని గురువారం ఇండియా కూటమి సమావేశంలో ఆరోపించారు.
ఎన్నికల సంఘం తీరుపై మరోసారి కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానం కలుగుతుందన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ లిస్ట్‌పై తీవ్ర రగడ నడుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఓ జాతీయ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు సిద్ధరామయ్య మద్దతు తెలిపారు.
త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్రం ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.