AAP vs BJP: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పోలింగ్ కేంద్రాలలో నగదు పంపిణీతో పాటు దొంగ ఓట్లు వేస్తున్నారని ఇర పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. సీలంపూర్ నియోజక వర్గంలో బురఖా ముసుగులో దొంగ ఓట్లు చేసేందుకు ప్రయతిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. పోలీసులు రోడ్డును దిగ్బంధించి, ఓటర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు బీజేపీకి మద్దతుగా పోలీసులు ఓటింగ్‌ను ఆపడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని మండిపడింది. దీంతో ఆప్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Read Also: Nani: జపాన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న నేచురల్ స్టార్ నాని మూవీ
ఇక, ఢిల్లీలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై ఆప్ తరపున గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, చిరాగ్ పోలింగ్ బూత్‌లో ప్రజలు ఓటు వేయకుండా ఢిల్లీ పోలీసులు ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ బూత్‌లలో బీజేపీ ప్రచార సామగ్రిని బహిరంగంగా ఉంచారని పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చిన ఏమీ చేయడం లేదని వాపోయారు. ఇంత జరుగుతున్నా.. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు.
Read Also: South Coastal Zone: విశాఖపట్నం కేంద్రంగా 410 కి.మీ పరిధితో కొత్త జోన్ ఏర్పాటు
అలాగే, అత్యంత సున్నితమైన ప్రాంతమైన రాష్ట్రపతి భవన్ సమీపంలోని బూత్ నంబర్ 27 N బ్లాక్‌లో బీజేపీ గూండాలు డబ్బులు పంచుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. నేను అక్కడికి చేరుకునేసరికి వారు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఓటరు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో మనకు ఉన్న అత్యంత శక్తివంతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెరుగైన సౌకర్యాల కోసం.. గూండాయిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వారికి వ్యతిరేకంగా ఓటు వేయండి అంటూ సంజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
VIDEO | Delhi Assembly Elections 2025: Uproar outside a polling booth in Seelampur as BJP alleges fake voting. Police jostle to maintain peace. #DelhiElections2025 #DelhiElectionsWithPTI pic.twitter.com/ldxATD8N4k
— Press Trust of India (@PTI_News) February 5, 2025
#WATCH | #DelhiElections2025 | AAP candidate from Greater Kailash Assembly seat, Saurabh Bharadwaj alleges Delhi Police is trying to stop people from casting their votes at a polling station in Chirag Delhi.
He says "You have been standing here since morning to influence… pic.twitter.com/FQvoVEYO8g
— ANI (@ANI) February 5, 2025