Delhi Elections: పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసులు సోదాలు.. బీజేపీ చెప్పినట్టుగా చేస్తున్నారని ఆప్ ఆరోపణ
- ఢిల్లీలో పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసులు సోదాలు
- బీజేపీ చెప్పినట్టుగా చేస్తున్నారని ఆప్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రచారానికి సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా మాటల యుద్ధం కూడా తారాస్థాయిలో నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. యమునా నీళ్లపై ఆప్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ ఏ రేంజ్‌లో సాగింది. తాజాగా ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ ఇంటిపై పోలీసులు దాడి వ్యవహారం మరోసారి రచ్చరచ్చ చేస్తోంది. రెండు పార్టీల మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలతో హాట్‌హాట్‌గా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Electric Vehicles: పెట్రోల్ – డీజిల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలతో అధిక కాలుష్యం!
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి తప్పుపట్టారు. ఈ మేరకు అతిషి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘‘బీజేపీ చేసిన తప్పులను, కాషాయ పార్టీ నేతలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు పట్టపగలే డబ్బులు పంచినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోసం వస్తువులను ప్రజలకు పంచేందుకు వెళుతున్నారు అయినప్పుటికీ పోలీసుల నుంచి స్పందన కరువైంది. కానీ.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటి పైకి సోదాలు చేసేందుకు మాత్రం వచ్చారు’ అంటూ అతిషి మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Etela Rajender : రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలి..
అతిషి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. అతిషి ఆరోపణలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆప్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మరోవైపు అతిషి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము సీఎం నివాసంలో ఎలాంటి సోదాలు చేపట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా సీ-విజిల్ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీసు బృందం పంజాబ్ సీఎం నివాసానికి రావాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు. అయితే భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని దర్యాప్తు చేసేందుకు అనుమతించలేదని స్పష్టం చేశారు.
#WATCH | Security deployed outside Kapurthala House, the official residence of Punjab CM Bhagwant Mann in Delhi pic.twitter.com/Ww0UHOUutP
— ANI (@ANI) January 30, 2025
दिल्ली पुलिस @BhagwantMann जी के दिल्ली के घर पर रेड करने पहुँच गई है।
भाजपा वाले दिन दहाड़े पैसे, जूते, चद्दर बांट रहे हैं- वो नहीं दिखता। बल्कि एक चुने हुए मुख्यमंत्री के निवास पर रेड करने पहुँच जाते हैं।
वाह री भाजपा! दिल्ली वाले 5 तारीख़ को जवाब देंगे!
— Atishi (@AtishiAAP) January 30, 2025
#WATCH | Delhi | Returning Officer OP Pandey says, "We have got a complaint about money distribution. We have to dispose of the complaint in 100 minutes. Our FST had come here which was not allowed to enter. I have come here to request them to let us enter along with a… pic.twitter.com/UbFR83Hrb1
— ANI (@ANI) January 30, 2025
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!