2024 ఎన్నికల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఎన్నికల నిర్వహణపై ఈసీ పునరాలోచించాలన్నారు. సాయంత్రం 6 తర్వాత ఏపీలోని ఎన్నో నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని, నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 7 తర్వాతే పోలయ్యాయన్నారు. సాయంత్రం 6 తర్వాత పెరిగిన ఓట్లపై ఈసీని విచారణ అడిగాం అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈవీఎంలపై…
ఒక సమూహం లేదా ఓటర్ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది.
ఓటర్ ఐడీ కార్డుల జారీపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఓటర్ గుర్తింపు కార్డులు 15 రోజుల్లో అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. కొత్త కార్డు లేదా అప్డేట్ కార్డులను 15 రోజుల్లోనే ఇవ్వాలని సూచించింది.
MLC Election Results: ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మోడ్లోకి వెళ్లింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు... రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాల పరిధిలోని ఉద్యోగులకు ఎన్నికల సంఘం క్యాజువల్ లీవ్ను ప్రకటించింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. మార్చి 3న నోటిఫికేషన్.. మర్చి 20న పోలింగ్, కౌంటింగ్ జరగనున్నాయి. తెలంగాణలో 5 , ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29తో ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలు: 1.మహమ్మద్ మహమూద్ అలీ 2.సత్యవతి రాథోడ్ 3.శేరి…
నేడు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం కానుంది. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర పార్టీలతో ఈసీ సమావేశం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చ జరగనుంది. ట్రయల్ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక అభ్యర్థిగా పెట్టాలని ఎన్నికల కమిషన్ అనుకుంటోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. సర్పంచ్ పదవికి జరిగే ఎన్నికలలో నోటాను ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’గా పరిగణించడం…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తాజాగా అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలపై లిఖిత పూర్వకంగా స్పందిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. "రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ప్రాధాన్యత ఇస్తుంది.
AAP vs BJP: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పోలింగ్ కేంద్రాలలో నగదు పంపిణీతో పాటు దొంగ ఓట్లు వేస్తున్నారని ఇర పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.