ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదం ముదురుతోంది. ఈ చట్టం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల అస్త్రంగా మారిందని పలువురు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సభల్లో తమ ప్రసంగాల్లో భాగంగా ఈ యాక్ట్ గురించి నెగిటివ్ గా చెబుతున్నారు.
MLC By Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. శాసనమండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
పెన్షన్దారులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే కాగా.. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా.. ఇవాళ ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు. మే 1న పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్గా ఉండటంతో.. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. దీంతో.. కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమికి గాజు గ్లాసు గండం వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు సీట్లను పంచుకున్నాయి. 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిగిలిన చోట్ల, టీడీపీ, బీజేపీలకు జనసేన మద్దతుగా నిలిచింది. ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు కాగా.. ఫ్రీ…
దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో బీహార్, హర్యానా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో ఎన్నికల వేళ మరో కీలక అంశంపై చర్చ జరుగుతోంది. ఫించన్ల పంపిణీ దగ్గర పడుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ముందు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు ఫించన్లు అందజేసేవారు.