Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై విచారణ జరపాలని సీఐడీకి ఈసీ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదం ముదురుతోంది. ఈ చట్టం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల అస్త్రంగా మారిందని పలువురు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సభల్లో తమ ప్రసంగాల్లో భాగంగా ఈ యాక్ట్ గురించి నెగిటివ్ గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఈసీకి చెప్పుకొచ్చారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈసీ తాజాగా పూర్తి విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది.
READ MORE: Bhavana: 7 ఏళ్లలో 4 అబార్షన్లు.. ఎట్టకేలకు ఓపెయినైన భావన..!
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఇదిలా ఉండగా.. ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధాన ఆస్త్రంగా మారింది. కూటమి పార్టీలు ఈ చట్టంతో మీ భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ దీనిపై స్పష్టత ఇచ్చారు. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని జగన్ గుర్తు చేశారు. ప్రజలు ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అయితే.. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా “వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తారు, దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు. ఇది జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. జగన్ ఓ ల్యాండ్ గ్రాబర్” అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ విచారణ అనంతరం ఈసీ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాని ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏం జరగనుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!