Mayawati: బీఎస్పీ కీలక నిర్ణయం.. వారసుడిగా మేనల్లుడ్ని తప్పించిన మాయావతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. బీజేపీపై వివాదాస్పద కామెంట్స్ చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి పరిపక్వత సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు.
Read Also: SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్‌పై నీలి నీడలు.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్!
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
కాగా, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపుగా కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దాని కోసమే అంకితం చేశామని మాయావతి చెప్పుకొచ్చారు. అందుకే కొత్తతరాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం.. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా ప్రకటించాం.. కానీ, పార్టీ, ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఆకాష్ పూర్తి స్థాయిలో పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్ కుమార్ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తించబోతున్నారని మాయావతి వెల్లడించారు.
Read Also: Lok Sabha Elections 2024 : పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అగ్ని ప్రమాదం.. ఎక్కడంటే..?
అయితే, ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్‌గా పేర్కొన్నారు. యువతను ఆకలితో ఉంచుతూ.. పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. ఈ పరిణామం తర్వాత ఆయన ర్యాలీలన్నింటినీ బీఎస్పీ క్యాన్సిల్ చేయడంతో పాటు ఆకాశ్ ఆనంద్ కు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా బీఎస్పీ తొలగించింది.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు