సార్వత్రిక ఎన్నికల రెండో ఘట్టం దగ్గర పడింది. ఏప్రిల్ 26నే రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శలతో నాయకులు ధ్వజమెత్తుకుంటున్నారు
ప్రస్తుతం భారతదేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నియమావళి నడుస్తోంది. ఇందులో భాగంగా అనేక ఆంక్షలు నడుమ రాజకీయ నాయకులు వారి ఎలక్షన్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు ఎన్నికల నియమాలను గుర్తుచేస్తున్న గాని మరోవైపు రాజకీయ నాయకులు ఒక్కోసారి వాటిని అతిక్రమించి ఎలక్షన్ కమిటీ చేత నోటీసులను ఇప్పించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు…
లోక్సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, విలువైన వస్తువులు భారీగా పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) రికార్డు స్థాయిలో డబ్బును సీజ్ చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర తాయిలాలను ఈసీ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల ప్రచారంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్లతో పోలిస్తే.. ఈసారి 34 శతం…
ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది.
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన…
జనసేన పార్టీని వదలని సింబల్ టెన్షన్ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. దీంతో ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల్లోగా బదిలీ కావాలని ఈసీ పేర్కొంది. అంతేకాకుండా.. తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న ఈసీ తెలిపింది.