ఈసీ కారణాలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో జమచేయలేదని ఈసీ ఆర్డర్ లో పేర్కొంది. స్కీంలు ప్రారంభించి నగదు బదిలీ చాలావరకు జరిగిన వాటిని కూడా అడ్డుకున్నారనీ అంటున్న వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో వివరాలు కూడా వెల్లడించింది అధికార వైసీపీ. జనవరి 29న మొదలైన ఆసరా చివది దఫా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. రూ. 6,394 కోట్లకు గానూ, రూ. 4, 555 కోట్ల బదిలీ అయిందని.. రూ. 1,839 కోట్ల మాత్రమే నగదు పెండింగ్ ఉన్నట్లు పేర్కొంది. ఈ పెండిగ్ డబ్బు ఇవ్వనీయకుండా టీడీపీ ఫిర్యాదులు చేసిందని, ఈసీ అడ్డుకున్నదని వైసీపీ విమర్శిస్తుంది.
Read Also: Hardik Pandya: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా నిందలు.. ఇద్దరి మధ్య వాగ్వాదం!
మార్చి 5 నుంచి జగనన్న విద్యాదీవెన పథకం కింద నగదు బదిలీ ప్రారంభం అయినట్లు వైసీపీ పేర్కొంది. రూ.703 కోట్లకు 98 కోట్లు బదిలీ, ఇంకా రూ.605 కోట్ల విడుదల నిలుపుదల అయ్యాయని తెలిపింది. ఇన్ పుట్ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ. 1,294 కోట్లు అని వెల్లడించింది. వైయస్సార్ చేయూత కింద ఇవ్వాల్సిన రూ. 5,065, ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సిన రూ.629 కోట్ల విడుదలపై టీడీపీ ఫిర్యాదులు చేసిందని పేర్కొంది. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి రూ.14,169 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.4,737 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయని.. మిగిలిన రూ. 9,432 కోట్లను అడ్డుకుంటూ టీడీపీ ఫిర్యాదులు, నిలుపుదల చేస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని వైసీపీ తెలిపింది.
Read Also: Sharia law: అమెరికన్లపై బలవంతంగా “షరియా చట్టాన్ని” ప్రయోగిస్తారు..యూఎస్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు..