తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గంపేట లోని గండేపల్లి మం మల్లేపల్లి వద్ద కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. విజయవాడ నుండి అన్నవరం గుడికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. విజయవాడ ఎస్ ఆర్ పేట పోలీసు స్టేషన్ లో ఎస్ ఐ గా పనిచేస్తున్న సత్యనారాయణ కుటుంబంతో సహా అన్నవరం వెళ్తుండగా కుక్క అడ్డువచ్చింది. దీనినుంచి తప్పించే క్రమంలో పొలాల్లోకి దూసుకువెళ్లిన కారు…
సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. థియేటర్ల రేట్లు, ఆన్‌లైన్ విధానంపై మంత్రి వారితో చర్చించనున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై థియేటర్ యజమానుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సినిమా థియేటర్ ఓనర్లతో మంత్రి సమావేశమై థియేటర్ల ఓపెన్, ప్రస్తుత విధానం నుంచి ఆన్ లైన్ విధానానికి మారే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానం కోసం రూపొందించే…
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జిల్లాలోని రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న నిర్వహించనున్న పోలింగ్ సమయాన్ని కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మారేడుమిల్లి మండలం దొరచింతవానిపాలెం, వీఆర్ పురం మండలం చినమట్టపల్లి ఎంటీటీసీ స్థానాలు, ఎటపాక మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని ఎస్ఈసీ తెలిపింది. అధికారులు ఈ విషయాన్ని ఆయా మండలాల్లోని…
మనం కొన్ని అంకెల్ని అంతగా ఇష్టపడం. అందులో ముఖ్యమయింది ఏడు. అందుకే గ్రామాల్లో ఆ పదం కూడా వాడరు. ధాన్యం బస్తాలైనా, ఏ వస్తువలైనా లెక్కించేటప్పుడు ఆ పదం పలకరు. ఆరునొకటి అంటారు. అదే సెంటిమెంట్ తూర్పుగోదావరి జిల్లాలోనూ వుంది. కోరుకొండ (మం) బుచ్చెంపేట పంచాయతీ ఏడో వార్డు ఎన్నికకు వింత పరిస్థితి నెలకొంది. వరుసగా మూడోసారి వార్డులో పోటీకి ఎలాంటి నామినేషన్లు రాలేదు. ఏడో వార్డ్ కి మెంబర్ అయితే ప్రాణగండం ఉందంటూ సెంటిమెంట్ వుండడంతో…
ఏపీలో రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన సభను చూస్తే జనసేనకు జనం బ్రహ్మరధం పడుతున్నారని అర్థమైందన్నారు. కేంద్రానికి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పారన్నారు. వైఎస్సార్ ప్రభుత్వం కేంద్రం మీద వత్తిడి తీసుకురాలేదన్నారు దుర్గేష్. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై అఖిల పక్షం వేయాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని, అయితే…
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా అరికడతామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు అన్నారు. పి.గన్నవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం, పోలీసు శాఖ ఫోకస్ మొత్తం గంజాయి పైనే ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి సాగు తక్కువగా ఉన్నప్పటికీ రవాణా మాత్రం ఇక్కడి నుండే జరుగుతుందన్నారు. ప్రజా రవాణా ద్వారా అక్రమార్కులు గంజాయిని తరలిస్తున్నారని, పోలీసులు అప్రమత్తంగా వుండాలని సూచించారు.…
వడ్డించేవాడు మనవాడే అయితే.. ఎక్కడున్నా ఫర్వాలేదు.. ఎంత తవ్వుకున్నా అడిగేవారు లేరని అనుకున్నారా? ఏకంగా 60 కోట్ల గ్రావెల్‌ను అమ్మేసుకున్నారా? మాఫియా మాయాజాలం పేరుతో కొండను గుల్లచేసి.. జేబులు నింపేసుకున్నవారు ఎంపీ అనుచరులా? ఆ మట్టి బాగోతం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎంపీ అనుచరులే మట్టిని తవ్వేశారా? నేలను చదును చేయడం అంటే.. ఎక్కడైనా రోడ్డుతో సమానంగా లేదా రోడ్డుకంటే కాస్త ఎక్కువగా పని పూర్తి చేస్తారు. కానీ.. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో మాత్రం డిఫరెంట్.…
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో కోట్లలో అభిమానులు ఉన్నారు. దీంతో తమ అభిమాన నటుడికి జీవితంలో ఒక్కసారైనా కలవాలని వారు తపించిపోతుంటారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన గంగాధర్ అనే యువకుడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అయితే గంగాధర్ ఓ దివ్యాంగుడు. అయినా అభిమాన హీరోను చూడాలన్న ఆశను మాత్రం చంపుకోలేదు. ఈ నేపథ్యంలో తన ఆరాధ్య హీరో కోసం సాహసం చేశాడు. ఏకంగా అమలాపురం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాదులోని…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఎస్‌ఈసీ అధికారులు ఎన్నికలను ఇవాళ నిర్వహించారు. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరిగింది. గతంలో మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగించారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్, డిప్యూటీ మేయర్‌ల పదవులకు…
తూర్పుగోదావరి జిల్లా పోలవరం నిర్వాసిత గ్రామవాసులు కంటిమీద కునుకు లేకుండా జీవితాలు గడుపుతున్నారు. సీతారం ఆర్ &ఆర్ న్యూ కాలనీ జనావాసాల్లోకి భారీ కొండ చిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు గ్రామస్తులు. ఆత్మ రక్షణ కోసం వాటిని హతమారుస్తున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో అర కొర సదుపాయాలతో నిర్మించిన కాలనీలు జనం పాలిట శాపంగా మారుతున్నాయి. అక్కడ కనీస సదుపాయాలు లేవు. వీధి దీపాలు లేవు,సిమెంట్ రోడ్లు లేవు,డ్రైనేజి వ్యవస్థ అసలే కనిపించడం లేదు,ఊరంతా నీటి…