ఏపీలో సముద్ర తీరంలో బంగారం.. ఎగబడుతున్న జనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎప్పటి నుంచో వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు ప్రజలు.. వజ్రాలు దొరికి కొందరు లక్షలు సంపాదిస్తే.. కొందరు కోటీశ్వరులు అయ్యారని చెబుతారు.. ఇక, చాలా మందికి నిరాశే మిగిలింది.. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరప్రాంతంలో బంగారపు నగలు దొరుకుతున్నాయనే మాట.. స్థానికుల చెవినపడింది.. దీంతో.. గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు స్థానిక మత్స్యకారులు.. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం కోసం వేట ప్రారంభించారు..
ఇప్పటికే కొందరికి బంగారు రేణువులు, రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలతో పాటు పలు బంగారు, వెండి వస్తువులు దొరికాయని చెబుతున్నారు.. బుధవారం రోజు కొందరికి బంగారు నగలు దొరకగా.. గురువారం రోజు కూడా ఉదయమే వెళ్లి సముద్ర తీర ప్రాంతాన్ని జల్లెడ పెడుతున్నారు ప్రజలు.. కాగా.. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాన్ సమయాల్లో బయటపడుతున్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నమాట.. ఇక, రెండు వరుస తుఫాన్లతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఈ బంగారం వేట కొనసాగుతోంది. అయితే, సముద్రతీరంలో బంగారం, బంగారు ఆభరణాలు లభ్యం కావడం మాత్రం మిస్టరీగానే మిగిలిపోతోంది. గతంలోనూ ఉప్పాడ బీచ్‌లో బంగారు నగలు దొరికిన సంగతి విదితమే..
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!