అది పవిత్ర పుణ్యక్షేత్రం. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పాలకవర్గం.. అధికారుల మధ్య నిత్యం పోరాటాలు.. కుమ్ములాటలు. అక్రమాలకు అంతే లేకుండా పోయింది. కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతున్నా సొంత లాభానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. వారెవరో.. ఆ ఆలయం ఏదో ఈ స్టోరీలో చూద్దాం. ఆలయానికి ఆదాయం పోతున్నా పట్టదు! తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో.. వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు స్వార్థపరులు దేవుడికే శఠగోపం పెడుతున్నారు. కేవలం షాపుల నుంచే 3…
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం.. అసలు రైతును మించిన గురువే లేడని వ్యాఖ్యానించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతరాష్ట్ర అరటి మార్కెట్ పరిశీలించిన ఆయన.. అరటి గెలలు అమ్ముకుంటున్న రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును మించిన గురువు లేడన్నారు.. నేను 12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నానని.. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు,…
సముద్రతీరంలో అలలు ఎలా విరుచుకుపడుతుంటాయో చెప్పక్కర్లేదు. మామూలు సమయాల్లో కూడా అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, విశాఖ జిల్లా భీమిలి, శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంతాల్లోని సముద్రపు అలలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంటాయి. అయితే, మంగళవారం రోజున రాజోలు నుంచి సముద్రంలోని 156 కిమీ దూరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 5.1 గా నమోదైన సంగతి తెలిసిందే. ఈ భూకంపం తరువాత సముద్రంలో సడెన్‌గా మార్పులు కనిపించాయి. ఎప్పుడు అలలతో…
నాడు-నేడు కార్యక్రమంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రూపుదిద్దుకున్న ఓ పాఠశాలను నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే జగనన్న విద్యాకానుకకు ఇక్కడే శ్రీకారంచుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 32 వేల మంది విద్యార్థులకు… ఈ విద్యా కానుకను అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు,…
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసిన ఈ జిల్లాల్లో తగ్గినట్టే తగ్గి.. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. కోవిడ్ కేసులు కారణంగా రాజమండ్రి ఆదర్శనగర్‌లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు.. కోవిడ్ కేసుల కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని…
ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి…
తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లోకి దర్శనాలకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ ఉదయం నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. అన్నవరంలో నేటి నుంచి భక్తులకు సత్యదేవుని వ్రతములు, కల్యాణములు, తలనీలాల సమర్పణకు అవకాశం కల్పించారు. అయినవల్లి , అంతర్వేది, అప్పనపల్లి, కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయాలకు భక్తుల రాక తిరిగి ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి మరుసటిరోజు…