తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గంపేట లోని గండేపల్లి మం మల్లేపల్లి వద్ద కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. విజయవాడ నుండి అన్నవరం గుడికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
విజయవాడ ఎస్ ఆర్ పేట పోలీసు స్టేషన్ లో ఎస్ ఐ గా పనిచేస్తున్న సత్యనారాయణ కుటుంబంతో సహా అన్నవరం వెళ్తుండగా కుక్క అడ్డువచ్చింది. దీనినుంచి తప్పించే క్రమంలో పొలాల్లోకి దూసుకువెళ్లిన కారు బోల్తా పడడంతో ఎస్.ఐ భార్య సరోజ అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.