తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ…
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసు కస్టడీ పిటిషన్ పై మిస్టరీ నెలకొంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కు పొంతనలేదు. మరో కొత్త సీన్ క్రియేట్ చేయడానికే కస్టడీ పిటిషన్ వేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు మృతుడు తల్లి ఈ హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పోలీసులు కొత్త చిక్కుల్లో పడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. గత నెల 19న…
ఎదిగే కొద్దీ మొక్క ఒదిగి ఉంటుంది. ఇది పదవుల్లో ఉన్న నేతలకు… వారి బంధువులకు వర్తిస్తుంది. వారే ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే మాట.. చేసే చేతలు పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ.. తమంతటి వారు లేరని విర్రవిగితే చిక్కుల్లో చిక్కుకోక తప్పదు. అంతేకాదు.. సొంత పార్టీని ఇబ్బందుల్లో పెడతారు. అలాంటి ముగ్గురు నాయకుల చుట్టూనే ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో చర్చ జరుగుతోంది. వారే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి…
వైసీపీ పాలకులు ప్రజలకు ఎలాగూ రక్షణ ఇవ్వరు.. కనీసం పోలీసులైనా స్వతంత్రంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా…
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత బాబు ను అదుపులోకి తీసుకోవడంపై మండలి చైర్మన్,అసెంబ్లీ సెక్రటరీ కి సమాచారం ఇచ్చారు కాకినాడ పోలీసులు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ పోలీసు కస్టడీలో ఉన్నారని ఏఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు. పోలీస్ కష్టడీని నిర్థారించారు అడిషనల్ ఏస్పీ శ్రీనివాస్. అనంతబాబుని ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ విచారిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని అత్యంత గోప్యంగా వుంచుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం సృష్టించింది.. అయితే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ ఆర్థిక సాయం ప్రకటించింది.. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఇక, నిందితుల అరెస్ట్ కోసం దళిత సంఘాలతో కలిసి తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతోంది టీడీపీ. మరోవైపు, దళిత…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం భార్య అంగీకారంతో మృతదేహానికి పోస్టుమార్టంకు తరలించారు. దీంతో సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఎస్పీ, కలెక్టర్ హామీతో సుబ్రమణ్యం భార్య, కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో అర్థరాత్రి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్యకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని…
కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. పోస్ట్ మార్టం నిర్వహించాలంటే కుటుంబ సభ్యుల సంతకాలు కావాలి. అయితే, కుటుంబసభ్యులు మాత్రం ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నుంచి స్పందన రాకపోవడం, కాకినాడ జీజీహెచ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేయడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు. సుబ్రహ్మణ్యం శవపంచనామాకు సంతకాలు పెట్టడానికి కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోయారు. మాకు న్యాయం చేసే వరకు సంతకాలు పెట్టమని అంటున్నారు…