MLC Ananthababu Case: ఎమ్మెల్సీ అనంతబాబు కేసు రెండువారాలకు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Ananthababu )డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్సీ అనంత బాబు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబును పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అడ్వకేట్లు వాదించారు. తమ కొడుకు హత్య కేసులో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని హైకోర్టును ఆశ్రయించారు హతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు.
కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేసిన సుబ్రమణ్యం తల్లిదండ్రులు. ఎమ్మెల్సీ అనంత్ బాబుపై మొత్తం 12 కేసులున్నాయని, రౌడీ షీట్ ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది. సుబ్రహ్మణ్యంను మొత్తం 5 మంది చంపి, తాను ఒక్కడే చంపినట్టు ఎమ్మెల్సీ అనంత్ బాబు పోలీసులు ముందు ఒప్పుకొని మిగతా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వినిపించారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్..
సీబీఐ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్ట్. కేంద్రం, డీజీపీ, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్ట్. ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్‌భాస్కర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కారులో మాజీ డ్రైవర్ డెడ్ బాడీ దొరకడం పలు విమర్శలకు తావిచ్చింది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం తనను బ్లాక్ మెయిల్ చేశాడని అందుకే హతమార్చానని ఎమ్మెల్సీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే… ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అపర్ణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. అటు టీడీపీ తరఫున కూడా 5 లక్షల పరిహారం బాధితుడు కుటుంబానికి చేరింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!