తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
ఈ కేసులో అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఇదివరకే అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే రెండు సార్లు విచారణ జరగగా. సోమవారం నాటి విచారణలో భాగంగా రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి… అనంతబాబు, పోలీసుల వాదనలను విన్నారు. ఈ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని ఈ నెల 15న వెల్లడిస్తానని చెప్పిన న్యాయమూర్తి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా అనేది తేలాల్చి వుంది. మరోవైపు డ్రైవర్ సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం జరిగింది. అయితే, పోస్టు మార్టం నివేదిక కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. మరణానికి ముందే డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి గాయాలయ్యాయని నివేదికలో వుంది.
Nupur Sharma Controversy : విదేశాల్లో నిరసన జ్వాలలు.. కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం..