కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం వుంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తికాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేసేది లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో జీజీహెచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిన్న అంతా కాకినాడ జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఎఫ్ ఐ ఆర్ కాపీ బయటకు వచ్చింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు పోలీసులు మృతి పై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానితుల పేర్లు ఫిర్యాదు లో చెప్పలేదని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు…
కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ డెడ్ బాడీ లభించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు నారా లోకేష్. డ్రైవర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంత బాబే హత్య చేశాడని జరిగిన ఘటన గురించి లోకేషుకి వివరించారు సుబ్రహ్మణ్యం తల్లి, భార్య. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న మాపై పోలీసులు దాడి చేశారని…
కాకినాడ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం రేపుతోంది? అసలేం జరిగిందనేది హాట్ టాపిక్ అవుతోంది. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య తో ఫోన్ లో మాట్లాడారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో అధికారపార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యంది గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు…