ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం సృష్టించింది.. అయితే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ ఆర్థిక సాయం ప్రకటించింది.. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఇక, నిందితుల అరెస్ట్ కోసం దళిత సంఘాలతో కలిసి తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతోంది టీడీపీ. మరోవైపు, దళిత సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నాయి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని.. బాధితుడు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: CM Jagan: దావోస్‌లో ఏపీ సీఎం.. రెండోరోజు షెడ్యూల్ ఇదే..
కాగా, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర గతంలో డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంది హత్యేనని పోస్టుమార్టం నివేదిక తేల్చిన విషయం తెలిసిందే.. కొట్టడంతోనే అతను మరణించినట్టుగా ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తీవ్రంగా కొట్టడం వల్లే సుబ్రహ్మణ్యం అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కూడా ఈ నివేదిక తెలుపుతుంది. ఇక, కాకినాడ బీచ్ లో సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపినట్టుగా అనుమానిస్తున్నారు. మృతుడి ఒంటిపై బీచ్ లో మట్టి, ఇసుక, ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులున్నాయని పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు. మృతుడి తల మీద ఎడమ వైపున గాయాన్ని కూడా పోస్టుమార్టం చేసిన వైద్యులు గుర్తించారు. ఎడమ చేయిపై కూడా గాయాలను గుర్తించారు. పై పెదవి మీద గాయాల విషయాలను కూనడా వైద్యులు నివేదికలో పేర్కొన్నారు.. ఎడమ కాలు బొటనవేలిపై కూడా గాయాలను గుర్తించారు. కుడికాలుపై కూడా గాయాలున్నాయి. అయితే, ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతిచెందాడంటూ.. తన కారులోనే ఎమ్మెల్సీ అనంతబాబు.. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వారి ఇంటికి చేర్చిన విషయం తెలిసిందే.