నేడు హైకోర్టులో ఎమ్మెల్సీ అనంత బాబు వేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. దళిత యువకుడ్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో అనంతబాబు 107 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. హైకోర్టు వాద. ప్రతివాదనలు విన్న తరువాత న్యాయమూర్తి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టు ఆదేశాలు మేరకు ఎమ్మెల్సీ అనంతబాబు నేర చరిత్ర, 17 కేసుల అభియోగపత్రం, మృతుడు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికను కాకినాడ పోలీసులు సమర్పించారు. అనంతబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ప్రాణహాని ఉంటుందని మృతుడు కుటుంబ సభ్యులు తరుపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీనితో పోలీసులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేర చరిత్రను పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వనున్నారు.
Read Also: Anurag Thakur : పీఎల్‌ఐ పథకం రెండవ విడతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు పోలీసులు ఇచ్చిన నివేదికలో అనంతబాబు నేర చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై 2014 ఆగస్టు 18న రౌడీషీట్ తెరిచి 2019 నవంబరు ఎత్తేశారు. అడ్డతీగల, గంగవరం, కాకినాడ వన్ టౌన్, విశాఖ 3వ టౌన్ పోలీసు స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి. వీటిలో 18 కేసుల్లో కొన్ని తప్పుడువని తేలింది. మరికొన్ని కొట్టేశారు ఒక కేసులో స్టే ఉంది. అనంత బాబుపై నమోదైన కేసుల్లో ఎస్సీ, ఎస్టీ చట్టం, స్త్రీ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఉద్యోగి విధులకు ఆటంకం, దాడి కేసు తదితరమైనవి ఉన్నాయి.
ఈ కేసులేవీ రుజువు కాలేదు అని పోలీసులు కోర్టుకు నివేదించారు. మే 23న అనంతబాబును రిమాండ్ కు పంపినప్పుడు ఆయనకు నేరచరిత్ర లేదని కాకి నాడ పోలీసులు అరెస్టు మెమోలో రాశారు. మృతుడు కుటుంబసభ్యుల తరుపు న్యాయవాదులు సమాచార హక్కు చట్టం ద్వారా అనంతబాబు నేర చరిత్ర వివరాలను హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీనితో హైకోర్టు కాకినాడ పోలీసులను ఆదేశించడంతో అనంతబాబు నేర చరిత్ర వివరాలు అందజేశారు. మూడుసార్లు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టు. మరి హైకోర్టు అనంతబాబు బెయిల్ పిటిషన్ పై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
Read Also: Minister Roja Vs Janasena: నగరిలో హైటెన్షన్.. రోజాకు జనసేన సవాల్