Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఈజిస్ట్ షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన శాంతి సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ఆసిమ్ మునీర్‌ను తన ‘‘ అభిమాన ఫీల్డ్ మార్షల్’’ అంటూ పిలిచారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తనకు మద్దతు తెలిపారని, అందుకు ఆయనకు థాంక్స్ అని ట్రంప్ అన్నారు.
Read Also: E20 Petrol: E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!
‘‘పాకిస్తాన్ ప్రధాని మీకు నేను చెప్పాలి. నాకు ఇష్టమైన ఫీల్డ్ మార్షల్ ఇక్కడ లేరు. కానీ ప్రధాని ఇక్కడ ఉన్నారు’’ అంటూ ట్రంప్ అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయడానికి షర్మ్ ఎల్ షేక్ వేదికగా సమావేశం జరిగింది. అయితే, అదే సమయంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారతదేశాన్ని కూడా ప్రశంసించారు. ప్రధాని నరేంద్రమోడీ చాలా మంచి స్నేహితుడు అని, ఆయన అద్భుతమైన పని చేశారని అన్నారు. ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు రాగానే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చాలా ఇబ్బంది పడ్డారు.