Trump: నువ్వో చెత్త రిపోర్టర్‌వి.. ముఖంలో స్మైలే లేదు.. మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ ఫైర్
- హీటెక్కిన ఓవల్ కార్యాలయం
- నువ్వో చెత్త రిపోర్టర్‌వి.. ముఖంలో స్మైలే లేదు
- మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఎప్‌స్టీన్ తాజా ఫైల్‌పై ప్రశ్నలు సంధించిన మహిళా జర్నలిస్ట్‌పై తనదైన శైలిలో ట్రంప్ విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో రుసరుసలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
ఓవల్ కార్యాలయం ఒక్కసారిగా హీటెక్కింది. ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతుండగా.. సీఎన్ఎన్ మహిళా రిపోర్టర్ కైట్లాన్ కాలిన్స్ జోక్యం చేసుకుని తాజాగా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీస్ సెక్స్ స్కామ్ ఫైల్‌పై ప్రశ్నలు సంధించింది. ఎప్‌స్టీన్ ఫైల్ విడుదలయ్యాక చాలా మంది బాధిత మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. మొత్తం సాక్షుల ఇంటర్వ్యూలు తొలగింపబడ్డాయని.. న్యాయం జరగలేదని భావించే మహిళలకు ఏం చెబుతారని నిలదీసింది. దీంతో ఒక్కసారిగా ట్రంప్ రిపోర్టర్‌పై మండిపడ్డారు. ‘‘నా గురించి ఏమీ బయటకు రాలేదు కాబట్టి.. దేశం వేరే దాన్ని గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నా. ఎప్‌స్టీన్, ఇతర వ్యక్తులు నాపై చేసిన కుట్ర తప్ప.. ఏమీ లేదు.’’ అని ట్రంప్ మేటర్‌ను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు.
కానీ రిపోర్టర్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రంప్ సమాధానానికి రిపోర్టర్ కైట్లాన్ కాలిన్స్ కౌంటర్‌గా మరో ప్రశ్న వేసింది. దీంతో ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆమెపై ఫైరయ్యారు. ‘‘నువ్వో చెత్త రిపోర్టర్‌వి. నీలాంటి వాళ్ల వల్లే సీఎన్ఎన్‌కి రేటింగ్స్ కూడా లేవు. నువ్వు నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. 10 సంవత్సరాలుగా నీ ముఖంలో చిరునవ్వు నేను ఎప్పుడూ చూడలేదు. అయినా నువ్వు ఎందుకు నవ్వడం లేదో నీకు తెలుసా. ఎందుకంటే నువ్వు నిజం చెప్పడం లేదని నీకు తెలుసు.’’ అంటూ ధ్వజమెత్తారు. అదే స్వరాన్ని ట్రంప్ కొనసాగిస్తూ.. ‘‘నువ్వు చాలా చెడ్డదానివి. నీకు తెలుసు. నువ్వు చెత్త రిపోర్టర్‌వి. ఆశ్చర్యపోనవసరం లేదు. నీలాంటి వాళ్లు వల్లే సీఎన్ఎన్‌కి రేటింగ్స్ లేదు.’’ అని ట్రంప్ కొనసాగించారు. అంతలోనే ట్రంప్ ప్రెస్‌మీట్ వైపు సైగ చేస్తూ ‘‘ఆమె ఎప్పుడూ నవ్వుదు’’ అంటూ మళ్లీ రిపీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
.@POTUS NUKES @kaitlancollins:
"I've known you for ten years. I don't think I've ever seen a smile on your face. You know why you're not smiling? Because you know you're not telling the truth. You're a very dishonest organization — and they should be ashamed of you." 🔥 pic.twitter.com/GJFcH6vqvi
— Rapid Response 47 (@RapidResponse47) February 3, 2026
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు