Stock Market: గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ .. అంబానీకి కలిసొచ్చిన వేల కోట్ల అదృష్టం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సత్తా కలిగిన నాయకుడు, అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన నెలకొనడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి కలిసి వచ్చింది. ఇంతకీ ట్రంప్ అంబానీకి కలిసి వచ్చే ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.. యూస్ నుంచి ఈజీగా ‘ఐఫోన్ 17’ తెచ్చేసుకోవచ్చు!
Also Read
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
భారత్‌పై సుంకాలను తగ్గిస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసింది. ట్రంప్ ప్రకటించిన ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్‌పై గట్టి ప్రభావాన్ని చూపింది. దీంతో దేశంలోని ప్రముఖ కంపెనీల విలువలు గణనీయంగా పెరిగాయి. టాప్ 10 కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ షేర్లు 7% పెరిగాయి, ఇన్ఫోసిస్, TCS షేర్లు 5% కంటే ఎక్కువ లాభాలను పొందాయి. అలాగే SBI కూడా 6% పెరిగింది. దీంతో ఈ ప్రధాన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ఒక్కరోజులోనే రూ.5.40 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 4,200 పాయింట్లకు పైగా దూసుకువెళ్లింది.
పెద్ద కంపెనీల మార్కెట్ క్యాప్‌లో భారీ పెరుగుదల..
* మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7 శాతానికి పైగా పెరిగాయి. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,33,768.49 కోట్లు పెరిగి రూ.20,14,985.17 కోట్లకు చేరుకుంది.
* ట్రేడింగ్ సెషన్‌లో HDFC బ్యాంక్ షేర్లు దాదాపు 7 శాతం పెరిగాయి. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.96,488.38 కోట్లు పెరిగి, రూ.15,23,500.64 కోట్లకు చేరుకుంది.
* దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ షేర్లు 6 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.41,068.96 కోట్లు పెరిగి, రూ.7,17,865.49 కోట్లకు చేరువ అయ్యింది.
* టీసీఎస్ షేర్లు ఈ రోజు 5.28% పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.60,563.02 కోట్లు పెరిగి, రూ.12,07,172.33 కోట్లకు చేరుకుంది.
* ICICI బ్యాంక్ షేర్లు 4.72 శాతం పెరిగింది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.45,637.64 కోట్లు పెరిగి, రూ.10,12,898.08 కోట్లకు చేరువ అయ్యింది.
* ఇదే సమయంలో ఎస్బీఐ షేర్లు కూడా దాదాపు 6 శాతం మేర పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే రూ.56,803.76 కోట్లు పెరిగి, రూ.10,05,948.20 కోట్లకు చేరుకుంది.
* దేశంలో అతిపెద్ద FMCG కంపెనీ అయిన హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు దాదాపు 2 శాతం పెరిగి, దాని మార్కెట్ క్యాప్ రూ.10,291.21 కోట్లకు, విలువ రూ.5,63,807.91 కోట్లకు చేరుకుంది.
* ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో బజాజ్ ఫైనాన్స్ షేర్లు 7.76 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి రూ.43,681.84 కోట్లు పెరిగి, రూ.6,06,412.23 కోట్లకు చేరుకుంది.
* దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ అయిన LIC షేర్లు ట్రేడింగ్ సెషన్‌లో 4.87 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.24,762.37 కోట్లు పెరిగి, రూ.5,33,134.05 కోట్లకు చేరుకుంది.
* అలాగే ఎల్ అండ్ టి షేర్లు కూడా 5 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే.. రూ.27,229.62 కోట్లు పెరిగి, రూ. 5,66,732.44 కోట్లకు చేరుకుంది.
READ ALSO: Rajamouli: ‘వారణాసి’ కోసం క్యూ కడుతున్న డిస్ట్రిబ్యూటర్లు.. కానీ జక్కన్న ప్లాన్ ఇదే!
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!