Hospital Negligence: ములుగు జిల్లాలోని RVM ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోగికి కనీసం స్కానింగ్ చేయకుండానే, వేరే వ్యక్తికి సంబంధించిన ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్‌ను ఇచ్చి ఆస్పత్రి సిబ్బంది అడ్డంగా బుక్కైంది.
Kidney Stones: ప్రస్తుత జీవన విధానంలో చాలామందికి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం సహజంగా మారిపోయింది. ఐతే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్ల నొప్పిని అనుభవించినట్లయితే, భవిష్యత్ సమస్యలను నివారించడానికి మీ ఆహారాన్ని నిర్వహించడం ఎంతో ముఖ్యం. మూత్రపిండాల్లో రాళ్ల విషయానికి వస్తే.. నివారించాల్సిన కొన్ని ఆహారాలు, అలాగే కొత్త రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడే ఆహారాలు ఉన్నాయి. మరి ఏ ఆహారాలు తినకూడదు, మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారికి ఏ ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయో ఒకసారి…
ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, ముడతలతో యువతీ, యువకులు బాధపడుతూ వుంటారు. వారు అనేక క్రీములు వాడుతుంటారు. అయితే తాజాగా మార్కెట్లోకి వచ్చింది ఫ్రీక్వెన్నీ థెరపీ. ఇది పెట్టుకుంటే ఎలాంటి నల్ల మచ్చలైనా మాయం అయిపోతాయి. ముడతలు మటుమాయం అవుతాయంటున్నారు శ్రీచందన. ఎన్టీవీ హెల్త్ లో ఆమె ఏం చెప్పారో చూద్దాం.
దేశంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదా? ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి వుందా? అంటే అవుననే అంటున్నారు డాక్టర్లు.వివిధ రకాల ఆరోగ్య ఇబ్బందులు వున్నవారు, వృద్ధులు, గుండెజబ్బులు, కిడ్నీ రోగాలు వున్నవారు ఈ ఫోర్త్ వేవ్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంది. షుగర్ పేషెంట్లు షుగర్ కంట్రోల్ లో వుంచుకోవాలని డాక్టర్ వసీం సూచిస్తున్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖ (medical health department) అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అయితే అంతగా ఆందోళన చెందవద్దని…
తెలంగాణలో సూరీడు చుర్రుమంటున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ వేడిమి పెరుగుతుంది. కానీ ఈసారి ఒక నెలముందుగానే ఎండలు పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 43.9 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాంకిడిలో 43.8 గా నమోదు అయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా…