Bare Foot Walking: చెప్పులు లేకుండా నడిచారా.. ఒకసారి ట్రైచేసి చూడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొద్దున్న నిద్రలేచిన దగ్గర్నించి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అసలు చెప్పులు లేకుండా అనేది ఊహించలేం. కేవలం దేవాలయానికి వెళ్లినప్పుడు, ఇంట్లో మందిరానికి వెళితే తప్ప చెప్పులు తీయం. కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటుంటారు. ఇలా చేయడం మంచిదేనా అని ఆలోచించండి. చెప్పులు విప్పి నడవడం అనేది కష్టమయినదే. కానీ అసాధ్యం మాత్రం కాదు. మన ఆరోగ్య కారణాల వల్ల మనం ఖచ్చితంగా పాదాలకు పాదరక్షలు లేకుండా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.. ఇంటి పని.. ఆఫీసు పనితో నిత్యం బిజీ ఉండే గృహిణి తన ఆరోగ్యం పట్ల చూపించే శ్రద్ధ కాస్త తక్కువేనని చెప్పాలి.
పిల్లల చదువు బాధ్యత కూడా ఆమె పైనే పడుతుంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా పోతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో వ్యాయామానికి వారికి సమయం దొరకడం కాస్త కష్టమే. అందుకే నడిచేటప్పుడు చెప్పుల్లేకుండా నడిస్తే ఒత్తిడి మాయమై ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన చెప్పులు వేసుకుని నడవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది ధరించే చెప్పుల వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. పాదాలకు సరైన వ్యాయామం లభించడం లేదు.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
చెప్పులు లేకుండా నడవడం వలన పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులు ఉండవు.. చెప్పులు లేకుండా నడిస్తే కీళ్ల నొప్పులు వుండవు. చెప్పులు లేకుండా నడపడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పాదాల కింద ఉండే నరాలు ఉత్తేజితం అవుతాయి. కంటి ఆరోగ్యం బాగుపడుతుంది. చెప్పులు లేకుండా నడిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు కొంచెం సమయం చెప్పులు లేకుండా నడిస్తే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఇలా నడవడం వల్ల తరచూ వేధించే నిద్రలేమి సమస్య ఉండదు..చెప్పులు లేకుండా నడవడం వలన మీ బాడీ రిలాక్స్ అవుతుంది. దీనితో నిద్ర బాగా పడుతుంది. ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. శరీరం అలసిపోవడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. కండరాలు బలంగా ఉంటాయి..చెప్పులు లేకుండా నడవడం వలన కండరాలు దృఢంగా మారుతాయి ఇలా ఇన్ని లాభాలను మీరు పొందొచ్చు. కనుక చెప్పులు లేకుండా నడుస్తూ ఉండండి దానితో ఈ సమస్యలకి మనం చెక్ పెట్టడానికి వీలవుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!