Hospital Negligence: శ్వాసకోశ సమస్యతో వెళ్తే ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిన ఆస్పత్రి.. షాకైన పేషెంట్!
- ములుగు జిల్లాలో RVM ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం..
- రోగికి స్కాన్ చేయకుండానే వేరే వ్యక్తి స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది..
- శ్వాసకోశ సమస్యతో వెళ్తే ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిన వైనం..
- విషయం బయటికి చెప్పొద్దని పేషేంట్ కుటుంబ సభ్యులను కోరిన ఆస్పత్రి సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hospital Negligence: ములుగు జిల్లాలోని RVM ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోగికి కనీసం స్కానింగ్ చేయకుండానే, వేరే వ్యక్తికి సంబంధించిన ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్‌ను ఇచ్చి ఆస్పత్రి సిబ్బంది అడ్డంగా బుక్కైంది. వివరాల్లోకి వెళితే.. ములుగు ప్రాంతానికి చెందిన కొమ్ము కవిత అనే మహిళ శ్వాసకోశ సమస్యతో RVM ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేయాలని తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు కవిత కుటుంబ సభ్యులు ఆమెను స్కానింగ్ రూమ్ దగ్గరకు తీసుకెళ్లారు. అయితే, స్కానింగ్ చేయక ముందే, కొమ్ము కవిత స్కానింగ్ రిపోర్ట్ సిద్ధంగా ఉందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఇచ్చారు. స్కానింగ్ జరగక ముందే రిపోర్ట్ రావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు దాన్ని పరిశీలించగా, అందులో అసలు విషయం బయటపడింది.
Read Also: MLA Adinarayana Reddy: వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర ఆరోపణలు..!
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
అయితే శ్వాసకోస సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన మహిళకు సంబంధించిన రిపోర్ట్ కాకుండా, ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో తమ రోగికి స్కానింగ్ చేయకుండానే, వేరే వ్యక్తి రిపోర్టును ఇచ్చారని ఆస్పత్రి సిబ్బందిని కుటుంబ సభ్యులు నిలదీయగా.. దీంతో తడబడిన ఆస్పత్రి సిబ్బంది, పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. ఈ విషయం బయటికి చెప్పొద్దని పేషెంట్ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి.. దీనికి పరిహారంగా మళ్లీ స్కానింగ్ తీస్తామని ఉచిత సలహా ఇచ్చారు. రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!