TG High Court: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కు తెలంగాణ హైకోర్టు లో చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
వినేశ్ ఫోగట్‌కు భారీ షాక్ తగిలింది. రజత పతకం కోసం చేసిన ఆమె అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాలని CAS నిర్ణయించింది. కాగా.. రజత పతకం వస్తుందని ఆశించిన వినేశ్ తో పాటు.. భారతవనికి నిరాశ ఎదురైంది.
మంత్రి అంబటి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రసంగానికి సంబంధించి నమోదైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్‌లను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఆరోపణలపై అసంబద్ద కేసు నమోదు చేశారని కోర్టు పేర్కొంది.