వినేశ్ ఫోగట్‌కు భారీ షాక్ తగిలింది. రజత పతకం కోసం చేసిన ఆమె అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాలని CAS నిర్ణయించింది. కాగా.. రజత పతకం వస్తుందని ఆశించిన వినేశ్ తో పాటు.. భారతవనికి నిరాశ ఎదురైంది. కాగా.. వినేశ్ ఫోగట్ నిర్ణయంపై మూడుసార్లు తీర్పు వాయిదా పడగా, ఆగష్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ చెప్పింది. ఈ క్రమంలో.. వినేశ్ ఇంకా అక్కడే ఉంది. తీర్పు వచ్చిన తర్వాతే, అక్కడి నుండి ఇండియాకు వస్తానని చెప్పింది. ఈ క్రమంలో.. కోర్టు ఈ నిర్ణయంతో భారీ షాక్ తగిలింది.
Read Also: North Korea: విదేశీ టూరిస్టులకు శుభవార్త చెప్పిన నియంత కిమ్..
పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)కు వినేశ్ అప్పీల్ చేసింది. తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. కాగా.. వినేష్‌కు క్రీడా రంగంలోని పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఆమె ఖచ్చితంగా పతకం సాధిస్తుందని సపోర్ట్ చేశారు.
Read Also: Mamata Banerjee: సీబీఐకి మమతా అల్టిమేటం.. ఆదివారంలోగా వైద్యురాలికి న్యాయం జరగాలి..