Ambati Rambabu Petition: మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి అంబటి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. చంద్రగిరిలో రీపోలింగ్ జరపాలంటూ మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. కాగా.. పల్నాడు జిల్లాలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రోజున అల్లర్లు, అరాచకాలు చెలరేగాయి. అయితే, ఈ భయాందోళనలకు పెద్ద ఎత్తున అవకతవకలు జరగడాన్ని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. సత్తెనపల్లి నియోజక వర్గంలోని 236, 237, 253, 254 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అంబటి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (గురువారం) విచారణ చేపట్టింది.
READ MORE: SIT Investigation: దాడి ఘటనపై విచారణకు హాజరైన పులివర్తి నాని..అధికారులతో ఏం చెప్పారంటే?
Also Read
- Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!
- World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్‌ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది. కొందరు నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
తాజావార్తలు
-
Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!
-
World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
-
Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
-
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
-
Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్‌ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!