ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గుండెపోటుతో మరణించారు. ఆదివారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. సమాచారం ప్రకారం.. రాకేష్ పాల్ అనారోగ్యంతో బాధపడుతూ రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ (RGGH) లో ఆదివారం ఉదయం చేరారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటన టెక్సాస్‌లోని లంపాసాస్ కౌంటీలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల అరవింద్ మణి, అతని భార్య 40 ఏళ్ల ప్రదీపా అరవింద్, 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మరణించినట్లు సమాచారం. అరవింద్ మణి కుటుంబం లియాండర్‌లో నివసిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక్కరే మిగిలారు. ప్రమాదం జరిగిన సమయంలో అరవింద్ మణి 14…
ఓ వివాహ వేడుకకు అని బయల్దేరిన ఒకే కుటుంబానికి చెందిన 12 మంది సభ్యుల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భటోలి గ్రామానికి చెందిన వీరంతా ఓ వివాహ శుభకార్యానికి అని బయల్దేరారు. అయితే.. మార్గమధ్యలో జెజో ప్రాంతంలో వాగులో పడి ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 11 మంది చనిపోగా.. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో…
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. మృతులు రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. తండ్రి కృష్ణ రైల్వే లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలను వెంట తీసుకుని వెళ్లాడు. తండ్రి కృష్ణ పిల్లలను ట్రాక్‌పై కూర్చోబెట్టి పని చేస్తున్నాడు. ఇంతలోనే ట్రాక్‌పైకి ట్రైన్ రావడంతో పిల్లలను కాపాడబోయాడు. కానీ.. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాల తనిఖీలు చేస్తుండగా.. అహ్లాన్ గగర్మండు ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూల మలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ, ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీరు చంద్రయాన్ గుట్ట వాసులుగా గుర్తించారు. వీరిలో హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12) సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు సానికులు తెలిపారు. రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీ కొట్టి కింద పడటంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో మంగళవారం హింస చెలరేగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాడి ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు.. యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఉక్రెయిన్‌లో మరణించాడు. రష్యా తరపున ఉక్రెయిన్‌లో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన తన తమ్ముడిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకున్నారని మృతుడి సోదరుడు చెబుతున్నాడు. యువకుడికి కొన్ని రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత.. ఉక్రెయిన్‌కు ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా పంపించారు. అక్కడ ఆ యువకుడు పోరాడుతూ మరణించాడు. యువకుడి మృతిని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.