జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బస్సు కాలువలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురు జవాన్లకు గాయాలయ్యాయి.
పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఒక నేరస్థుడు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. తనను పోలీసులు పట్టుకుంటారని తెలుసుకుని.. ఓ నేరస్థుడు ఢిల్లీలోని యమునా క్రాసింగ్ ఏరియాలోని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కెనడాలో హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ప్రణీత్ అనే యువకుడు కెనడాలో ఎం.ఎస్ (Master of Science) చేయడానికి అని వెళ్లాడు. అయితే.. అక్కడ చెరువులో ఈతకు వెళ్లి చనిపోయాడు.
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజానగరం మండలంలోని పల్ల కడియం గ్రామంలో వృద్ధ దంపతులు ప్రాణాలను కోతి తీసింది. ఫురుగు మందుల ప్యాకెట్ తీసుకుని వచ్చి వృద్ధ దంపతులు పేరట్లో పారేసిన కోతి.. అయితే, టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకొని టీ తాగిన వెలుచూరి గోవింద్ (75), అప్పాయమ్మ (70) వృద్ధ దంపతులు మృతి చెందారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్‌పాస్‌లో నీరు నిలిచి ఉండటంతో.. అది గమనించని ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీరు నిలిచిపోవడంతో వారి ఎస్యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శనివారం తెలిపారు.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 5 రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి చెందాడు. వి.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కర్ణాటక రాష్ట్రం వెంగసంద్రాకు చెందిన కార్తీక్ (28) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
ప్రపంచ ప్రసిద్ధ బాడీబిల్డర్‌గా పేరుగాంచిన ఇలియా యెఫిమ్చిక్ గుండెపోటుతో మరణించారు. అతని వయస్సు కేవలం 36 సంవత్సరాలు.. అతను చాలా ఫిట్‌గా ఉన్నప్పటికీ.. గుండెపోటుతో చనిపోవడం అందరూ షాక్‌కు గురయ్యారు.
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు.