Pakistan: పాకిస్తాన్ భారీ దాడి.. 400 మందికి పైగా మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కాబూల్‌లోని ఒక రిహాబిటేషన్ ఆస్పత్రిపై దాడులు చేసింది. ఈ ఘటనలో 400 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ మంగళవారం తెల్లవారుజామున తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స చేసే ఆస్పత్రిపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సోమవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో ఆస్పత్రిలోని చాలా భాగాలు నాశనమయ్యాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 400 మంది మరణించారని, దాదాపు 250 మంది గాయపడ్డారని ఆయన అన్నారు. భవనంలో మంటలను అదుపు చేయడానికి మరియు శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయని ఫిత్రాత్ తెలిపారు.
అయితే.. కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లలో జరిపిన దాడుల్లో తాము పౌరుల్ని లక్ష్యంగా చేసుకోలేదని, ఏ ఆస్పత్రిపై దాడులు చేయలేదని పాకిస్తాన్ పేర్కొంది. ఆఫ్ఘాన్‌పై జరిగిన ఈ దాడిని తాలిబాన్ అధికారులు తీవ్రంగా ఖండించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారే ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. స్థానిక టెలివిజన్ ఆస్పత్రి శిథిలాల నుంచి వెలువడుతున్న మంటల్ని చూపించింది.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
Read Also: Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!
ఆఫ్ఘాన్ చేస్తున్న వాదనల్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. తాము ఏ పౌరస్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని చెప్పింది. ఈ ఆరోపణల్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి మోషారఫ్ జైదీ తోసిపుచ్చారు. తాము సైనిక, ఉగ్రవాద మద్దతు కలిగిన మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌ను చాలా జాగ్రత్తగా నిర్వహించిట్లు పాక్ మంత్రిత్వ శాఖ చెప్పింది.
పాకిస్తాన్, ఆఫ్ఘన్ దళాలు తమ సరిహద్దులో కాల్పులు జరిపాయని ఆఫ్ఘన్ అధికారులు చెప్పిన కొన్ని గంటల తర్వాత ఆరోపించిన వైమానిక దాడి జరిగింది. పాకిస్తాన్ నుంచి రాత్రిపూట మోర్టార్ షెల్స్‌తో ఆగ్నేయ ఖోస్ట్ ప్రావిన్సులోని గ్రామాలపై దాడి చేశారని, ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించినట్లు ఆఫ్ఘాన్ ఆరోపించింది. రెండు దేశాల సరిహద్దు ‘‘డ్యూరాండ్ లైన్’’ వద్ద పోరాటం తీవ్రమైంది. పాకిస్తాన్ లోపల దాడి చేస్తున్న పాకిస్తాన్ తాలిబన్లతో సహా అనేక ఉగ్రవాద గ్రూపులకు ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తుందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే, ఆఫ్ఘాన్ పాక్ ఆరోపణల్ని ఖండించింది.
BREAKING: More videos from tonight's Pakistani airstrikes which hit a drug rehabilitation hospital in Kabul, killing or wounding an unspecified number of people, according to an Afghan Taliban spokesperson.
Pakistan’s government rejects this, claiming they targeted "military… pic.twitter.com/GtRmnicTLW
— Yalda Hakim (@SkyYaldaHakim) March 16, 2026
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!