రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి యతేంద్ర ఉపాధ్యాయగా గుర్తించారు. అయితే.. నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, ఈరోజు గుండెపోటుతో మరణించాడు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తరగతి గది లోపలికి వస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.
పాకిస్థాన్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఐఏ) విమానాన్ని హైజాక్ చేసిన వాంటెడ్ టెర్రరిస్ట్ గజిందర్ సింగ్ (74) మరణించాడు. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. గజిందర్ సింగ్ ఒక పేరుమోసిన ఉగ్రవాది, అతను ఖలిస్తాన్ అనుకూల సంస్థ "దాల్ ఖల్సా" సహ వ్యవస్థాపకుడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-423 హైజాక్‌లో ప్రధాన కుట్రదారుల్లో ఇతను ఒకడు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం హైజాక్‌కు గురై పాకిస్థాన్‌లోని…
కరిచింది పెంపుడు కుక్కే కదా అని చేసిన నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. కుక్కకు రాబిస్ సోకిన విషయం తెలుసుకోకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆలస్యం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యువకుడు. ఈ విషాదం విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. తండ్రి నర్సింగరావు ఆర్టీసీలో కండక్టర్ గా పని చేసి గత ఎనిమిదేళ్లుగా పెరాలిసిస్ వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. కుమారుడు భార్గవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఉత్తరాఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురిని బలి తీసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 19 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వరకు మూడు కార్లు పౌరీలో లోతైన లోయలో పడిపోయాయి. కాగా, శనివారం రుద్రప్రయాగ్‌లోని అలకనంద నదిలో టెంపో ట్రావెలర్ పడిపోవడంతో 14 మంది ప్రయాణికులు మృతి…
రాంచీలోని మహమ్మద్ అలీ హుస్సేన్ కువైట్‌లోని భవనం అగ్నిప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన తర్వాత అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల అలీ.. తన తల్లి కువైట్ కు వెళ్లొద్దని చెప్పినప్పటికీ, మెరుగైన జీవితం కోసం 18 రోజుల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే.. గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అలీ మృతి చెందాడు.
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలు కేరళకు చేరుకున్నాయి. బుధవారం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 45 మంది భారతీయులే ఉన్నారు.
మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. జూన్ 1 నుంచి ప్రారంభమైన వర్షాల ప్రభావంతో.. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ఇందులో పిడుగుపాటు కారణంగా 11 మంది మృతి చెందారు. డివిజనల్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన ప్రాథమిక సర్వే నివేదిక ప్రకారం.. గత రెండు రోజుల్లో పర్భానీ, హింగోలి జిల్లాల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి.
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాము కాటేయడంతో రాణి (16)అనే బాలిక మృతి చెందింది. వేసవి కాలం సెలవుల కోసమని తన బంధువులైనా పెద్దమ్మ ఇంటికి కత్తిగూడెం వెళ్లింది. అయితే సరదాగా గడుపుదామనుకున్న బాలిక శవమై వచ్చింది. పెద్దమ్మ ఇంటి వద్ద గడ్డివాము దగ్గర ఆరుబయట మంచం మీద కూర్చుంది. తనకు తెలియకుండానే విష పురుగు రాణిని కాటేసింది. మొదట ఎలుకగా భావించిన కుటుంబ సభ్యులు.. బాలిక పరిస్థితి విషమించింది. దీంతో.. బాలికను వెంటనే…
పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనం కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం.. ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని షాంగ్లా జిల్లాలోని బర్బత్‌కోట్ ప్రాంతంలో సోమవారం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఐదుగురు మరణించినట్లు స్థానిక మీడియా సంస్థ సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్యూ సిబ్బంది.. మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.