Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..
- రంజాన్ మాసంలో ‘‘అల్-అక్సా’’ మసీదు క్లోజ్..
- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ నిర్ణయం..
- ఇజ్రాయిల్‌పై ముస్లిం దేశాల ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Al-Aqsa Mosque: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ గత 16 రోజులుగా ముస్లింలకు పవిత్రమైన మసీదుల్లో ఒకటైన ‘‘అల్ అక్సా మసీదు’’ను మూసేసింది. రంజాన్ మాసంలో ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నాయి. రంజాన్ సందర్భంగా మసీదు మూసివేయాలని ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయంపై అరబ్ దేశాల కూటమి ‘‘అరబ్ లీగ్’’ ఆదివారం తీవ్రంగా విమర్శించింది.
ముస్లింల ప్రార్థనా స్థలాలను మూసేసి, అక్కడ ప్రార్థనలు చేయకుండా చేసే హక్కు ఇజ్రాయిల్‌కు లేదని అరబ్ లీగ్ పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఇజ్రాయిల్ చర్యలు ప్రాంతీయ, ప్రపంచశాంతి, భద్రతలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పింది. జెరూసలేం పవిత్ర స్థలాలపై ఇజ్రాయిల్ చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలను ఆపాలని, ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ లీగ్ ప్రపంచదేశాలను విజ్ఞప్తి చేసింది. ఆరాధనా స్వేచ్ఛను గౌరవించేలా దేశాలు చూసుకోవాలని అరబ్ లీగ్ పిలుపునిచ్చింది.
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
Read Also: Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?
అరబ్ లీగ్‌తో పాటు అనేక సంస్థలు, దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఎనిమిది అరబ్-ఇస్లామిక్ దేశాలు మసీదు మూసివేతను సంయుక్తంగా ఖండించాయి.ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC), ముస్లిం వరల్డ్ లీగ్ (MWL), అల్-అజార్, ఆఫ్రికన్ యూనియన్, అరబ్ పార్లమెంట్ కూడా ఇజ్రాయిల్ నిర్ణయంపై మండిపడుతున్నాయి. ఇది ప్రార్థనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి. 1967 తర్వాత, ఇలా ఇన్ని రోజులు మసీదును మూసేయడాన్ని పాలస్తీనియన్ అథారిటీ ఖండించింది. హమాస్ దీనిని ‘‘యుద్ధ ప్రకటన’’గా అభివర్ణంచింది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌తో మొదలైన యుద్ధంతో ఆక్రమిత జెరూసలేంలోని అల్ అక్సా మసీదును ఇజ్రాయిల్ మూసేసిన సమయంలో అరబ్ లీగ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఇబ్రహీమి మసీదులో కేవలం 50 మంది మాత్రమే ప్రార్థన చేయడానికి అనుమతిస్తున్నారు. 1967లో ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంను ఆక్రమించినప్పటి నుండి ఇది అతి పొడవైన రంజాన్ షట్‌డౌన్‌గా మారింది. భద్రతా కారణాలు, ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరుగాయనే కారణంతోనే మూసివేసినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!